TS : నేడు ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్

Update: 2024-05-08 04:53 GMT

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు కోర్టు జుడీషియల్ కస్టడీ పొడిగించిన సంగతి తెలిసిందే. ఈడీ కేసులో ఈనెల 14 వరకు, సీబీఐ కేసులో ఈనెల 20 వరకు పొడిగించింది. ఈ రెండు కేసుల్లో వేర్వేరుగా ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేయడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని కవిత నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు కవిత అరెస్ట్ ను చాలెంజ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆమె భర్త అనిల్ తెలిపారు. దీంతో ఇవాళ హైకోర్టులో ఆమె బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేయనున్నారు. మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్-45 ప్రకారం బెయిల్ అర్హత ఉందనే విషయాన్ని పేర్కొన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వారిని దేశం దాటించి.. తన లాంటి వాళ్లను అరెస్ట్ చేయడం అన్యాయమని కవిత అన్నారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని ఆమె కోరారు.

లిక్కర్ కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడి అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. జైలులో ఉండగానే ఏప్రిల్ 11వ తేదీన సీబీఐ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 22వ తేదీన రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ మీద వాదనలు జరిగాయి. తీర్పును మే 2వ తేదీకి.. తర్వాత 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ రోజు రెండు కేసుల్లో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

Tags:    

Similar News