తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బోనస్ పైసలివ్వకుండా తప్పించుకోవడానికి వడ్ల కొనుగోలు చేయకుండా జాప్యం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. బ్రోకర్ల నుండి కమీషన్లు దండుకునేందుకు రాష్ర్ట రైతుల ప్రయోజనాలను బలి పెడుతున్నారని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు వద్ద బీజేపీ నాయకులతో కలిసి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు సంజయ్. వడ్ల కొనుగోలులో రైతులు పడుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. వడ్ల పైసలన్నీ మిత్తీతోసహా కేంద్రమే చెల్లిస్తోందన్నారు. అయినప్పటికీ వడ్లు కొనివ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన మిత్తీతో సహా నొప్పి ఏంటని ప్రశ్నించారు బండి సంజయ్.