Bandi Sanjay: ఫామ్‌హౌస్‌లో డీల్ అంతా కేసీఆర్ డ్రామా: బండి సంజయ్
Bandi Sanjay: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు.;
Bandy Sanjay: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఫామ్‌హౌస్‌లో డీల్ అంతా కేసీఆర్ డ్రామా అని ఆరోపించారు. మునుగోడులో ఎంపీ ధర్మపురి అరవింద్, ఇంద్రాసేనారెడ్డి, బీజేపీ నేతలతో కలిసి ఆయన ఛార్జ్‌షీట్ విడుదల చేశారు.
ఈ డ్రామా వెనుక కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ అంతా కేసీఆర్‌దేనని విమర్శించారు. మునుగోడు ఉపఎన్నికలో గెలవడానికి ఇంత తతంగమా అని కౌంటర్ ఇచ్చారు. తాము ఆడియో టేపులు అడిగితే.. ఇంకా ఆడియో టేపులు తయారు కాలేదని చెప్పడమేంటని నిలదీశారు. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎమ్మెల్యేలను ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు.
ఈ డీల్ వెనుక బీజేపీ ఉందని సీపీ ఎట్లా చెప్తారన్నారు. ప్రగతి భవన్ దుర్మార్గులు, కుట్రలు, కుతంత్రాలకు కోచింగ్ సెంటర్‌గా మారిందని తెలిపారు. తాము కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. దమ్ముంటే సిట్టింగ్ జడ్ఙితో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు.
మునుగోడులో ఓటమి భయంతోనే కేసీఆర్ దిగజారి.. బీజేపీని బద్నాం చేయడానికి నీచమైన డ్రామాకు తెరలేపారని బండి సంజయ్ నిప్పులు చెరిగారు.