Bandi Sanjay : సిద్దిపేట జిల్లా బెజ్జంకి చేరుకున్న ప్రజా సంగ్రామయాత్ర..!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రానికి చేరుకుంది.;
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రానికి చేరుకుంది. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఆగస్ట్ 28న చార్మినార్ నుంచి ప్రజాసంగ్రామ యాత్రను ప్రారంభించిన బండిసంజయ్ పాదయాత్ర 32వ రోజుకు చేరుకుంది. పాపన్నపల్లి సభలో బండి సంజయ్ మాట్లాడుతూ... తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబం చేసిన త్యాగాలేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యల్ని గాలికి వదిలేసి, ఫాం హౌస్ కే సీఎం కేసీర్ పరిమితమయ్యారని ఆరోపించారు. రైతాంగం, నిరుద్యోగ సమాజం తరపున బిజెపి కొట్లాడుతుందని, టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపేవరకు తన పోరాటం ఆగదన్నారు. మానకొండూర్ నియోజకవర్గానికి దళితబంధు ఎందుకు ఇవ్వడం లేదని, ఎన్నికలు ఉన్నచోట మాత్రమే ఇస్తారా అని ప్రశ్నించారు. హుజూరాబాద్ లో ఈటల గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.