Bhatti Vikramarka : మా వల్లే కేంద్రం తలొగ్గింది : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
దేశంలో కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం తెలంగాణ ప్రజా ప్రభుత్వం, ప్రజల విజయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం ప్రజా భవన్ క్యాంపు కార్యాలయంలో బీసీ ఉద్యోగుల సంఘం, బీసీ కుల నాయకులు ఉప ముఖ్యమంత్రిని భారీ గజమాలతో సన్మానం చేసి అభినంద నలు తెలిపారు. ఈ సందర్భంగా భట్టి మాట్లా డుతూ 'కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు ప్రజా ప్రభుత్వం ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా కులగణన సర్వే చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపించాం. మా ఒత్తిడి ఫలితంగానే సెంట్రల్ తలదించి వచ్చి కులగణన చేస్తామని ప్రకటించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం మాత్రమే ఎలాంటి ఆక్షేపణ లేకుండా శాస్త్రీయంగా కులగణన సర్వే నిర్వహించి దేశానికి రోల్ మోడల్గా నిలిచింది. ఈ సర్వేలో కులాల గురించి మాత్రమే కాకుండా ప్రజలకు సంబంధించిన ఆర్థిక, రాజకీయ, ఉద్యోగ అవకాశాలు, సహజ వనరులు అన్ని వర్గాలకు ఎంత వరకు పంచబడ్డాయి?, వారి జీవన ప్రమాణ పరిస్థితులు ఎట్లా ఉన్నాయన్న అంశాలను సేకరించాం. కులగణన సర్వే ద్వారా వచ్చే ఫలితాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రజా ప్రభుత్వానికి బీసీలు అండగా ఉండాలి' అని కోరారు.