ధరణి ఓ దుర్మార్గ చట్టమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. అందుకే భూభారతి చట్టం తీసుకొచ్చామని ఆయన అసెంబ్లీలో చెప్పారు. ‘ధరణి ఎజెండాతోనే మేం ఎన్నికలకు వెళ్లాం. ధరణి బాగుందా లేదా అని ఎన్నికల్లో ప్రజల తీర్పుతోనే స్పష్టమైంది. బీఆర్ఎస్ తప్పు చేసింది కాబట్టే ఓడించారు. భవిష్యత్‌లోనూ భూభారతిపైనే ఎన్నికలకు వెళ్తాం. ఆ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి మద్దతిస్తారో చూద్దాం’ అంటూ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. వీఆర్ఏ వ్యవస్థను మళ్ళీ తీసుకొస్తామని.. వీఆర్ఏలు కావాలని ప్రజలు అడుగుతున్నారని అన్నారు.బీఆర్ఎస్ నేతలు కట్టు కథలు చెబుతున్నారని మండిపడ్డారు పొంగులేటి. ధరణి తెచ్చి రూల్స్ అసలు ఫ్రేమ్ చేయలేదు.. మేము చట్టం తెచ్చి రూల్స్ సిద్ధం చేస్తున్నాం.. మీరు మాకు చెప్పడం ఎందుకు అని క్వశ్చన్ చేశారు. బీఆర్ఎస్ నేతలు కట్టుకథలు చెప్పి, ప్రజల్ని మోసం చేసే పనిలో ఉన్నారు అని మంత్రి పొంగులేటి విమర్శించారు.