BJP in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ దూకుడు..
BJP in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ దూకుడు పెంచిందా? ఆపరేషన్ లోటస్ ప్రారంభించిందా? తాజా పరిణామాలు చూస్తుంటే ఇవే సంకేతాలు కనిపిస్తున్నాయి.;
BJP in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ దూకుడు పెంచిందా? ఆపరేషన్ లోటస్ ప్రారంభించిందా? తాజా పరిణామాలు చూస్తుంటే ఇవే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణపై ప్రధాని మోదీ... స్వయంగా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.
గుజరాత్ ఎన్నికలు ముగియడంతో.. బీజేపీ హైకమాండ్.. తెలుగు రాష్ట్రాలపై దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో మోదీ మిషన్‌కు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ఢిల్లీలో నిన్న షర్మిల విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు ప్రధాని మోదీ. తెలంగాణలో షర్మిలను కారులో క్రేన్ ద్వారా తీసుకెళ్లిన ఉదంతంపై జగన్‌తో ప్రస్తావించారు.
దీనిపై మోదీకి ఎలాంటి సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయారు జగన్. ఇప్పుడు ఈ అంశంపై స్వయంగా షర్మిలకు ఫోన్ చేసి మాట్లాడారు ప్రధాని మోదీ. దాదాపు 10 నిమిషాల పాటు షర్మిలతో ఫోన్లో మాట్లాడారు. తెలంగాణలో రాజకీయాలు, ఇటీవల జరిగిన ఘటనపై ఆరాతీశారు. ఢిల్లీకి రావాల్సిందిగా షర్మిలను ఆహ్వానించారు.
తాజా పరిణామాలు చూస్తుంటే.. షర్మిల బాణాన్ని తెలుగు రాష్ట్రాలపై ఎక్కుపెట్టినట్లు కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మోదీనే స్వయంగా ఆపరేషన్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మిషన్ మరింత ఉద్ధృతంగా కొనసాగే అవకాశాలున్నాయి. ఈ పరిణామలతో ... తెలుగు రాష్ట్రాల రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది