దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ విజయం
దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఆ పార్టీ నుంచి పోటీచేసిన రఘునందన్ రావు సమీప టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై 892 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. తొలిరౌండ్..;
దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఆ పార్టీ నుంచి పోటీచేసిన రఘునందన్ రావు సమీప టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై 1470 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. తొలిరౌండ్ నుంచి ఆధిక్యత కనబరచిన రఘునందన్ రావు.. 13వ రౌండ్ నుంచి వెనుకబడ్డారు. అయితే మళ్ళీ 20వ రౌండ్ నుంచి పుంజుకున్నారు. ఇక 21, 22 , 23 రౌండ్లలో ఆధిక్యత కనబరిచి ఎట్టకేలకు విజయం సాధించారు. బీజేపీకి మొత్తం 62,772 ఓట్లు రాగా, టిఆర్ఎస్ కు 61,302 ఓట్లు వచ్చాయి.. ఇక కాంగ్రెస్ కు 21,819 ఓట్లు మాత్రమే వచ్చాయి.