బీఆర్ఎస్ అగ్ర నేతలు కేటీఆర్, హరీష్ రావు కోతల రాయుళ్లు అంటూ సెటైర్లు వేశారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కాంగ్రెస్ వ్యూహాల ముందు కేటీఆర్ ఆలోచన, అనుభవం ఎంత? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇవ్వడం వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కల్పవృక్షం లాంటిదన్నారు. మర్రిచెట్టు లాంటి కాంగ్రెస్ పార్టీని కేటీఆర్ పీకేస్తా అనడం సాధ్యమేనా అని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు.