కళ్లముందే కుప్పకూలిన మూడంతస్తుల భవనం
కొత్త భవనం నిర్మాణం కోసం సెల్లార్ తీస్తుండగా.. పక్కనే ఉన్న మూడంతస్తుల బిల్డింగ్ నెలమట్టమయ్యింది.;
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఒక్కసారిగా మూడంతస్తుల భవనం కుప్పకూలింది. అయితే అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కొత్త భవనం నిర్మాణం కోసం సెల్లార్ తీస్తుండగా.. పక్కనే ఉన్న మూడంతస్తుల బిల్డింగ్ నెలమట్టమయ్యింది. దీంతో భారీగా శబ్దాలు రావడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. అక్కడున్న వాచ్‌మెన్ స్వల్పంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి ముందే ఆ భవనంలో ఉంటున్న 10 మంది బయటకు వెళ్లారు. దీంతో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అక్కడివారంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు... సంటనాస్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.