MGBS : వరద ప్రభావంతో బస్సు రూట్ల మళ్లింపు.. ఎంజీబీఎస్ తాత్కాలికంగా మూసివేత...

Update: 2025-09-27 08:00 GMT

హైదరాబాద్‌లో కుండపోత వర్షాల కారణంగా మూసీ నది మహోగ్రరూపం దాల్చింది. భారీ వర్షాలతో జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తి భారీగా వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో మూసి నదికి ప్రవాహం పెరిగి ఎంజీబీఎస్ వైపు వెళ్లే రెండు బ్రిడ్జిలు నీట మునిగాయి. అంతేకాకుండా, వరద నీరు నేరుగా బస్ స్టాండ్ లోకి చేరడంతో... బస్ స్టాండ్ ను తాత్కాలికంగా మూసి వేసారు అధికారులు.

దీంతో ఎంజీబీఎస్ నుండి వివిధ ప్రాంతాలకు వెళ్ళే బస్సు సర్వీసుల స్టార్టింగ్ పాయింట్లను మార్చుతున్నట్లు TGSRTC ప్రకటించింది. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపు వెళ్లే బస్సులను జేబీఎస్ నుండి వరంగల్, హన్మకొండ వైపు వెళ్లే బస్సులు ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుండి సూర్యాపేట, నల్గొండ, విజయవాడ వైపు వెళ్లే బస్సులు ఎల్బీనగర్ నుండి, మహబూబ్‌నగర్, కర్నూల్, బెంగళూరు వైపు వెళ్లే బస్సులు ఆరాంఘర్ నుండి అందుబాటులో ఉండనున్నాయి. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి, సహకరించాలని ఆర్టీసీ సంస్థ కోరింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం టీజీఎస్‌ఆర్‌టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సంస్థ సూచించింది.

Tags:    

Similar News