TG : రైతు రుణమాఫీపై ఈనెల 15 లేదా 18న కేబినెట్ భేటీ

Update: 2024-06-14 09:05 GMT

ఆగస్టు 15లోగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని బహిరంగంగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 15 లేదా 18న మంత్రిమండలి సమావేశాన్ని నిర్వహించనున్నారు.

రుణమాఫీకి అవసరమైన నిధుల సమీకరణ, లబ్ధిదారుల ఎంపిక విధానం, రుణమాఫీకి సంబంధించి కటాఫ్ తేదీ నిర్ణయం, మహారాష్ట్ర పర్యటనలో అధ్యయనం చేసిన అంశాలపై విశ్లేషణ తదితర అంశాలపై కేబినెట్ అజెండాలో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా పర్యటనల అజెండాపై కూడా మంత్రిమండలిలో చర్చించి తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది.

రైతు రుణమాఫీకి ఏ రైతులు అర్హులవుతారు అనేది ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News