సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మహబూబాబాద్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా సొమ్లాతండాలో హెలిప్యాడ్ వద్దకు ఇన్నోవా క్రిస్టా కారులో వెళ్తుండగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను సురక్షితంగా కారులోంచి బయటకు తీసుకొచ్చారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. నరేందర్ రెడ్డికి ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు..