విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై కారు బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. 65వ నెంబర్ జాతీయ రహదారిపై సూర్య పేట జిల్లా మునగాల మండలం బరాకత్ గూడెం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విజయ వాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు మార్గమధ్యలో బరకత్ గూడెం వద్దకు రాగానే డివైడర్ మధ్యలో ఉన్న విద్యుత్ పోల్ను ఢీ కొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యా యి. విషయం తెలుసుకున్న పోలీసులు, 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని కోదాడ ప్రభుత్వాసులకు తరలిం చారు. అయితే చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. వీరికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.