TG : హనుమాన్ టెంపుల్ దగ్గర మేక బలిపై కేసు నమోదు

Update: 2024-10-22 07:45 GMT

మహేశ్వరం గట్టుపల్లి హనుమాన్ టెంపుల్ వద్ద మేక బలిపై పోలీసుల కేసు నమోదు చేశారు. వీర హనుమాన్ ఆలయం పక్కన దర్గా వద్ద మేకను ఉమర్ బలి ఇవ్వడం కలకలం రేపింది. ఉమర్‌ను మహేశ్వరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉమర్ పై BNS 298, 299 కేసులు నమోదు చేశారు. మేక బలిపై VHP నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని.. ఈ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిన వారిపై యాక్షన్ తీసుకోవాలని పలు ధార్మికసంఘాలు డిమాండ్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

Tags:    

Similar News