HCA : అజారుద్దీన్, హెచ్‌సీఏపై కేసులు నమోదు..
HCA : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది;
HCA : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. HCA నిర్లక్ష్యంపై ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. అటు HCA అధ్యక్షుడు అజారుద్దీన్‌కు ఉచ్చు బిగుస్తోంది. మ్యాచ్ నిర్వహణలో నిర్లక్ష్యంపై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. తాజాగా అజారుద్దీన్‌పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు బీసీ పొలిటికల్ JAC ఛైర్మన్ యుగంధర్ గౌడ్. టికెట్ల విషయంలో నిర్లక్ష్యం వహించడంతో, అజారుద్దీన్ అవినీతికి పాల్పడ్డారని HRCలో ఫిర్యాదు చేశారు.
అజారుద్దీన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి.. పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది బీసీ పొలిటికల్ JAC. గాయపడ్డ బాధితులకు 20లక్షల రూపాయల పరిహారం చెల్లించాలంది.