TG : సర్వే వివరాలు గోప్యం .. ఎవరూ ఆందోళన చెందొద్దు : భట్టి విక్రమార్క

Update: 2024-11-06 15:30 GMT

ఇతర రాష్ట్రాల్లో చేసిన సర్వేను లోతుగా ఆధ్యాయనం చేశాకే రాష్ట్రంలో కులగణనను చేపట్టుతున్నట్లుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సర్వే వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామ న్నారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇవాళ ప్ర జాభవన్లో ప్రెస్మీట్ భట్టి మాట్లాడారు.. సెప్పల్లోఫార్మాట్లో 56 ప్రధాన ప్రశ్నలు.. 19 అనుబంధ ప్రశ్నలు ఉంటాయన్నారు. ' జిల్లా స్థాయిలో ప్రజల, విద్యావేత్తల అభిప్రా యాలు, సూచనలు తీసుకున్న తర్వాతే ప్రశ్నలు తీసుకున్నాం. కొంతమంది కావాలని కులగణనపై తప్పుడు ప్రచారం చేస్తున్నా రు. భారత రాజ్యాంగంలో ఉన్న మౌలిక సూత్రాలు అమలు చేయాలనే ఆలోచన లేని వాళ్లే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దేశంలో కులాలు ఉన్నాయి అనేది వాస్తవం. దాన్ని సర్వేలో అడిగితే తప్పు ఎలా అవుతుంది? డేడికేటెడ్ కమిషన్ లోకల్ బాడీ ఎన్నికల్లో ఓబీ సీలకు రిజర్వేష కల్పించేందుకు పనిచేస్తోంది. హరీష్ రావు లాంటి వారికి భారత రాజ్యాంగం స్పిరిట్ అమలు చేసే ఆలోచన లేదు. ఈ సర్వే ఏ పథకాలు తొలగించేందుకు కాదు. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు లు బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. అలాంటి వాళ్లు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. రాష్ట్ర ప్రణాళికలుకు ఈ సర్వే ఉపయోగపడుతోంది. తెలంగాణలో జరిగే ఈ కార్యక్రమం దేశానికి మాడల్ గా నిలవబోతోంది. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఈ సర్వే ఎంతో ఉపయోగపడుతుంది. ప్రగతిశీల భావాలు కలిగిన నాయకులు, మేధావులు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలి. సర్వే కోసం ఆధార్కార్డులు, రేషన్ కార్డులు అందుబాటులో ఉంచుకోవాలి. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారు. రాహుల్ గాంధీ సూచన మేరకు కుల గణన చేపడుతున్నం. సమగ్రమైన సమాచారం వచ్చిన తర్వాత అందరికి సమాన అవకాశాలు వస్తాయి. ప్రజలందరూ సమగ్ర సర్వేకు సహక రించాలి. ఉద్యోగస్తులు సామాజిక బాధ్యత తో పనిచేసేందుకు ముందుకు రావడం అభినంద నీయం' అని భట్టి విక్రమార్క అన్నారు.

Tags:    

Similar News