Bifurcation Issue: విభజన సమస్యలపై కేంద్రం కీలక భేటీ
CENTRE, HOME, MINISTREE, KEY, MEETING, Bifurcatio,n Issue, tv5, tv5news;
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నిర్వహించింది. హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ భేటీకి రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఇతర అధికారులు హాజరయ్యారు. ఏపీ విభజన చట్టంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమీక్షించారు. సమన్వయంతో ఇరు తెలుగు రాష్ట్రాలు సమస్యలను పరిష్కరించుకోవాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సూచించారు. రెండు రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మద్దతు ఉంటుందని హోం శాఖ తెలిపింది. నిధుల పంపకాల్లో సమస్యలపై సానుకూల దృక్పథంతో ఉండాలని హోం శాఖ సూచించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్సహా ఇతర ఉన్నతాధికారులు భేటి అయ్యారు.
పెండింగ్ సమస్యలపై కీలక చర్చ
విభజన సమస్యలే ప్రధాన ఎజెండాగా జరిగిన ఈ భేటీలో రాష్ట్ర విభజన సమస్యలపై తెలుగు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ చర్చించారు. రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన చట్టం అంశాలపై చర్చించారు. రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల తర్వాత కూడా ఇంకా సమస్యలు ఉండటంపై కేంద్ర హోం శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. తమకే ఎక్కువ కావాలని పట్టుబడితే ఇద్దరీకి నష్టం వస్తుందని చెప్పినట్లు తెలుస్తోంది. 9, 10 షెడ్యూల్‌లోని సంస్థల విషయంలో న్యాయ సలహాలు తీసుకొని ముందుకెళ్లాలని అధికారులు నిర్ణయించారు. తదుపరి భేటిలో ఒక నిర్ణయం తీసుకుందామని హోం శాఖ కార్యదర్శి చెప్పినట్లు తెలిసింది.
సానుకూల దృక్పథంతో ఉండండి
నిధుల పంపకాల్లో సమస్యలపై సానుకూల దృక్పథంతో ఉండాలని కేంద్ర హోంశాఖ సూచించినట్లు తెలుస్తోంది. తమకే ఎక్కువ కావాలని పట్టుబడితే రెండు రాష్ట్రాలకు నష్టం వస్తుందని చెప్పినట్టు తెలుస్తోంది. ఏపీ విభజనచట్టం 9, 10 షెడ్యూల్‌లోని సంస్థల ఆస్తులు, అప్పుల పంపకాల విషయంలో న్యాయ సలహాలు తీసుకొని ముందుకెళ్లాలని అధికారులు నిర్ణయించారు. తదుపరి భేటీలో ఒక నిర్ణయం తీసుకుందామని హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సూచించారని కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి.