Bhadrachalam Karakatta : చంద్రబాబు కరకట్ట కట్టించకపోతే.. భద్రాద్రి జలమయం.. సోషల్ మీడియాలో వైరల్..
Bhadrachalam karakatta : చంద్రబాబు కరకట్ట కటించకపోతే భద్రాద్రి జలమయం అయ్యేదంటున్న నెటిజన్లు
Bhadrachalam Karakatta : టీడీపీ అధినేత చంద్రబాబు విజన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముందు చూపు ఆయనకున్న ప్రధాన బలం . ఆ ముందు చూపే... హైదరాబాద్‌ను హైటెక్ సిటీ చేసింది. మెడికల్ హబ్ గా దేశానికే తలమానికమైంది. విశాఖలో మెడ్ టెక్ జోన్ అందరి గుర్తింపు పొందింది. ఇప్పుడు తెలంగాణను వరదలు అతలాకుతలం చేస్తున్న వేళ చంద్రబాబు ముందు చూపు...మరోసారి హాట్ టాపిక్ గా మారింది..
గోదావరి నది ఉగ్రరూపు దాల్చడంతో భద్రాచలం జలమయమైంది. కొన్ని ఇళ్లు సగం దాకా మునిగిపోతే.. మరికొన్ని ఎనిమిది అడుగుల దాకా మునిగిపోయాయి! గోదావరి నీటిమట్టం 70 అడుగలుకు పైకి వచ్చి... 36 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టింది. మామూలుగా అయితే ఈ రికార్డు స్థాయి వరదకు భద్రాచలం పూర్తిగా మునిగిపోవాలి. అయితే.. అప్పట్లో చంద్రబాబు ముందు చూపే... ఇప్పుడు భద్రాద్రిని.... వరద ముప్పునుంచి బయట పడేసింది.
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఎంతో ముందుచూపుతో భద్రాచలం పట్టణానికి వరద ముప్పు నివారించేందుకు కరకట్టను నిర్మించారు. రూ.53కోట్లతో ఎటపాక నుంచి సుభాష్ నగర్ వరకు 10 కిలోమీటర్ల వరకు ఈ కరకట్టను నిర్మించారు. అదే ఇప్పుడు భద్రాద్రికి రక్షణ కవచంగా నిలిచింది. ఏకంగా 10 వేల కుటుంబాలు వరద ముంపునకు గురవకుండా కాపాడగలిగింది.
ప్రస్తుతం కరకట్ట లేని ప్రాంతంతోపాటు కరకట్టలో ఉన్న స్లూయిస్‌లో లీకులతోనే దిగువ ప్రాంతం జలమయమైంది. ఈ కరకట్టే లేకపోతే భద్రాచలం మూడొంతులు జలమయం అయ్యేదంటున్నారు నీటిపారుదల రంగ నిపుణులు.
భద్రాద్రి కరకట్ట నిర్మాణంలో చంద్రబాబు చూపిన ముందుచూపే ఇప్పుడు అందరిని కాపాడిదంటూ .. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.