హైదరాబాద్ మలక్‌పేట వద్ద వర్షం బీభత్సం సృష్టించింది. వరద నీటికి మలక్‌పేట్ న్యూ మార్కెట్ మెట్రో స్టేషన్ వద్ద బైకులు కొట్టుకుపోయాయి. మలక్‌పేట అండర్ బ్రిడ్జి వద్ద నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
నీరు అంబులెన్స్ ఇంజిన్‌లోకి పోవడంతో నిలిచిపోయింది. దీంతో కోదాడ నుంచి నిమ్స్ ఆసుపత్రికి తరలిస్తున్న పేషంట్ గంటపాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాయం కోసం హండ్రెడ్‌కు నెంబర్‌కు ఫోన్ చేసినా స్పందించలేదని రోగి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
రోగికి ఆక్సీజన్ కూడా అందక ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు… చివరకు ఓ ఆటోలో వారు నిమ్స్‌కు బయల్దేరారు. మరోవైపు.. రోడ్డుపై వరదలో బండ్లు జాగ్రత్తగా నడపాలని అధికారులు సూచించారు. ఫ్లో ఎక్కువగా ఉంటే ఆగి వెళ్లాలని సూచించారు.