Chicken Prices Drop : హైదరాబాద్ లో మళ్లీ తగ్గిన చికెన్ ధరలు.. కేజీ ఎంతంటే!
హైదరాబాద్ లో చికెన్ ధరలు మళ్లీ తగ్గాయి. గురువారం కేజీ స్కిన్‌లెస్ రూ.186, విత్ స్కిన్ రూ.164 చొప్పున అమ్మకాలు జరిపారు. నేడు ఏకంగా కేజీ మీద రూ.15 నుంచి రూ.18 వరకు తగ్గించారు. శుక్రవారం కేజీ స్కిన్ లెస్ రూ.168, కేజీ విత్ స్కిన్ రూ.148గా ధర నిర్ణయించారు. కొన్ని హోల్ సేల్ దుకాణాల్లో రూ. 160కే అమ్మకాలు జరుపుతున్నారు. రిటైల్ షాపుల్లో మాత్రం ధరలు యథావిధిగా ఉంటున్నాయి.
హైదరాబాద్ లో బర్డ్ ఫ్లూ పూర్తిగా అదుపులో ఉందని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డా. దామోదర వెల్లడించారు. దీంతో చికెన్ మార్కెట్ ఊపిరిపీల్చుకుంది. కేజీ రూ. 140కి పడిపోయిన ధరలు మళ్లీ పెరిగాయి. గురువారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. కేజీ స్కిన్‌లెస్ రూ. 186, విత్ స్కిన్ రూ. 164గా ధరలు నిర్ణయించారు. కోళ్ల నుంచి మనుషులకు సోకిన కేసులు ఎక్కడా నమోదు కాలేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు.
మరోవైపు వనపర్తి జిల్లా కొన్నూరులోని ఓ ఫాంలో 3 రోజుల్లో 2,500 కోళ్లు మృత్యువాత పడటం కలకలం రేపుతోంది. కోళ్లు చనిపోయిన ప్రాంతాన్ని సందర్శించిన అధికారులు, శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు. ఈనెల 16న 117, 17న 300, మిగతా కోళ్లు 18న చనిపోయాయని వెల్లడించారు. 19న శాంపిల్స్ సేకరించి పంపామన్నారు. 5,500 సామర్థ్యం కలిగిన ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ప్రీమియం ఫాంలో ఈ కోళ్లు చనిపోయాయని తెలిపారు.