ఫోన్ ట్యాపింగ్‌పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. ట్యాపింగ్ బాధితుడైన సీఎం రేవంత్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీ పెద్దల ఒత్తిడికి లొంగిపోయారా అని ప్రశ్నించారు లక్ష్మణ్.
కేసీఆర్ అవినీతిపై రేవంత్‌రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. అటు రాష్ట్ర గీతంగా అందెశ్రీ గేయాన్ని స్వాగతిస్తున్నామని.. రాష్ట్ర చిహ్నంపై అధికారిక ప్రకటన తర్వాత స్పందిస్తామన్నారు.
కాగా... తెలంగాణ రాష్ట్ర గేయంపై తెలంగాణ సంగీత కళాకారులు అభ్యంతరం చెబుతున్నారు. లోకల్ వాళ్లని కాకుండా కీరవాణితో చేయించడాన్ని తప్పుపడుతున్నారు.