Bhatti Vikramarka : ఢిల్లీలో అమరులైన రైతులకు పరిహారం ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం: భట్టి
Bhatti Vikramarka : ఢిల్లీలో అమరులైన రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క;
Bhatti Vikramarka : ఢిల్లీలో అమరులైన రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క. ఐతే తెలంగాణ కోసం అమరులైన వారికి ఏడున్నరేళ్లయినా న్యాయం జరగలేదన్నారు. 12 వందల అమరుల కుటుంబాలకు ఇస్తామన్న పది లక్షలు, డబుల్ బెడ్రూం ఇల్లు, ఉద్యోగం ఇప్పటివరకూ అందలేదన్నారు. కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ యుద్ధం ప్రకటించడం సంతోషమేనన్న భట్టి...యూ టర్న్ తీసుకోకుండా ఉండాలన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ఆఘిపోయాయన్నారు. కేంద్రం నీళ్ల వాటాలు తేల్చకుంటే ఏడేళ్లుగా కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు భట్టి.