హాలియా బహిరంగ సభకు బయల్దేరిన సీఎం కేసీఆర్..!
నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని హాలియా బహిరంగ సభకు సీఎం కేసీఆర్ బయల్దేరారు. మార్గమధ్యంలో టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.;
నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని హాలియా బహిరంగ సభకు సీఎం కేసీఆర్ బయల్దేరారు. మార్గమధ్యంలో యాచారం దగ్గర కేసీఆర్‌కు టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వాహనం నిలిపి కేసీఆర్ ప్రజలకు అభివాదం చేశారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరుగనుంది. దాదాపు 50వేల మందికిపైగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తారని అంచనా వేస్తున్నారు.
అందుకు తగినట్లుగా ఏర్పాటు చేశారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో అనుములు చేరుకోనున్న సీఎం కేసీఆర్.. రోడ్డు మార్గం ద్వారా హాలియా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సీఎం రాక సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. మాస్క్ ఉంటేనే ప్రజలను టీఆర్ఎస్ సభకి ఆహ్వానించనున్నారు.