CM Revanth : స్వతంత్ర భారత చరిత్రలోనే సీఎం రేవంత్ తొలి నిర్ణయం

Update: 2024-09-14 06:45 GMT

భారతదేశంలోని అయిదు పెద్ద నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఈ ఐదు మహానగరాల్లో అతి తక్కువ ట్రాఫిక్ జామ్ సమస్య ఇక్కడే ఉంది. ఇది పెరగకుండా మ్యాన్ పవర్ ను పెంచేదిశగా.. లేని వారికి ఉపాధి కల్పించే దిశగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారు. ట్రాన్స్ జెండర్ల గుర్తింపు, నియామకం, శిక్షణ తర్వాత, ఈ ట్రాన్స్ జెండర్ బృందాలు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు అండగా నిలుస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

స్వాతంత్య్ర భారత దేశ చరిత్రలోనే తొలిసారిగా ట్రాన్స్ జెండర్ల సంక్షేమం, వారి కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ నియామకాల ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) ప్రకటించారు. ట్రాన్స్ జెండర్ల విషయంలో ఇంతటి కీలకమైన అడుగు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేదంటున్నారు నిపుణులు.

ఇది పాలనలో సృజనాత్మకమైన ఆలోచనకు ఉత్తమ ఉదాహరణ అంటున్నారు ప్రభుత్వ అధికారులు. రెండు కీలకమైన సమస్యలను ఏకకాలంలో పరిష్కరించే ప్రయత్నం అని అంటున్నారు. ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పన, హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే ప్రయత్నంగా విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News