సీఎం రేవంత్ రెడ్డిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి వజ్రం లాంటి వారని..ఆయన హృదయ అంతరాల్లోంచి ఇందిర సౌర గిరి జల వికాసం పథకం ఉద్భవించిందని భట్టి విక్రమార్క చెప్పారు. భూమి కోసం నల్లమల్ల గడ్డపై పోరాటాలు జరిగాయని తెలిపారు. నల్లమల డిక్లరేషన్ ద్వారా గిరిజన కుటుంబాలు అభివృద్ధి చెందుతాయన్నారు. సంపద సృష్టిస్తాం..సృష్టించిన సంపద పేదలకు పంచుతాం..ఇదే తమ నినాదమని భట్టి అన్నారు.