తెలంగాణను రైజింగ్ గుజరాత్ మోడల్‌కు కౌంటర్‌గా అభివృద్ధి చేస్తుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దానిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు సీఎం రేవంత్‌రెడ్డి. కిషన్ రెడ్డి గుజరాత్‌కు గులాములా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏది ఏమైనా మూసీ డెవలప్ మెంట్ ప్రాజెక్టు కొనసాగుతుందన్నారు. గుజరాత్ నుంచి వచ్చిన అదానీ, ప్రధానీ మహారాష్ట్రను దోచుకుంటున్నారని విమర్శించారు. రెండో రోజు ప్రచారంలో భాగంగా ఆయన నాగ్‌పూర్‌లో పర్యటిస్తున్నారు. ఉద్దవ్ థాక్రే సీఎం అయితే వారి దోపిడీకి అడ్డుకట్టపడుతుందన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలన్న మోడీ పదకొండేళ్లలో ఇచ్చింది కేవలం 7 లక్షల ఉద్యోగాలేనని విమర్శించారు.