TS : నేడు మూడు చోట్ల సీఎం రేవంత్ ప్రచారం

Update: 2024-05-03 05:16 GMT

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ ఈరోజు మూడు చోట్ల ప్రచారంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3గంటలకు ధర్మపురి, సాయంత్రం 4గంటలకు సిరిసిల్లలో జరిగే జన జాతర బహిరంగ సభల్లో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారు. సాయంత్రం 6.30గంటలకు ఉప్పల్‌లో నిర్వహించే రోడ్ షోలో పాల్గొని, ఆ తర్వాత కార్నర్ మీటింగ్‌లో మాట్లాడుతారు.

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రత్యేక మేనిఫెస్టోను కాంగ్రెస్ ఆవిష్కరించనుంది. ఇవాళ గాంధీ భవన్‌లో సీఎం రేవంత్ 23 అంశాలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. దీనిని ఇంటింటికి ప్రచారం చేసేలా కాంగ్రెస్ ప్రణాళికలు చేస్తోంది. ఈ మేనిఫెస్టోలో కొత్త ఎయిర్ పోర్టులు, రైల్వే లైన్లు, ఇంటింటికి ఉచిత సోలార్ సిస్టమ్ వంటి హామీలు ఉన్నట్లు సమాచారం.

కాంగ్రెస్ గెలిస్తే రిజర్వేషన్లు పెరుగుతాయని, బీజేపీ గెలిస్తే రద్దవుతాయని CM రేవంత్ అన్నారు. ‘కులగణన చేయాల్సి వస్తుందనే కేంద్రం జనాభా లెక్కలు చేపట్టడం లేదు. రిజర్వేషన్లపై మాట్లాడినందుకే నాపై కేసు పెట్టారు. రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందనే 2021లో జనాభా లెక్కలు చేపట్టలేదు. దేశంలో 15 రాష్ట్రాలు ఆమోదిస్తే రిజర్వేషన్లు రద్దు చేయవచ్చు. అందుకే బీజేపీ 8 రాష్ట్రాలను లాక్కుంది’ అని ఆసిఫాబాద్ సభలో ఆరోపించారు.

Tags:    

Similar News