వరంగల్ సభలో కేసీఆర్ చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ప్రస్టేషన్ లో మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ ప్రసంగంలో పసే లేదన్నారు. తాను ముఖ్యమంత్రి అయిన రెండో రోజే కేసీఆర్ గుండె పగిలిందన్నారు. పిల్లలను అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నారో చెప్పాలన్నారు పదవి పోయిందన్న అక్కసుతో కేసీఆర్ మాట్లాడారని సీఎం రేవంత్ అన్నారు. ప్రధాని మోడీ అవసరాలకు అనుగుణంగా కేసీఆర్ నడుచుకుంటున్నారని ఆరోపించారు. ఆపరేషన్ కగార్ పై జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సి ఉందని.. పార్టీలో చర్చించాకా విధానపరమైన నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.