CM Revanth Reddy : నేడు కర్ణాటకకు సీఎం రేవంత్

Update: 2024-12-26 07:45 GMT

సీఎం రేవంత్ రెడ్డి నేడు కర్ణాటకకు వెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా మహాత్మా గాంధీ ఎన్నికై వంద సంవత్సరాలు గడిచిన సందర్భంగా బెల్గాంలో రెండు రోజుల పాటు సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి. అందులో రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్, దామోదర రాజనర్సింహ, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తదితర నేతలు పాల్గొననున్నారు. ప్రత్యేక విమానంలో వెళ్లి రెండు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. బెలగావిలోనే గాంధీజీ ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అందుకే అక్కడ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు "నవ సత్యాగ్రహ భైఠక్‌" అని కాంగ్రెస్ అధిష్ఠానం నామకరణం చేసింది. ఈ మేరకు సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, పీసీసీలు, సీఎల్పీ నేతలు, పార్లమెంటరీ పార్టీ ఆఫీస్‌ బేరర్లు, సీఎంలు, మాజీ సీఎంలు సహా దాదాపు 200 మంది కీలక నేతలకు ఆహ్వానం పంపింది. ఈ మేరకు తెలంగాణ నుంచి కాంగ్రెస్ నేతలు పెద్దఎత్తున వెళ్లనున్నారు.

Tags:    

Similar News