CM Revanth Reddy : ఈనెల 20న వేములవాడకు సీఎం రేవంత్

Update: 2024-11-16 10:45 GMT

వేములవాడలో ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈసందర్భంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్‌ సమీక్షించారు. సిఎం సందర్శించే చైర్మన్ గెస్ట్ హౌజ్ ,శంఖు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసే ప్రాంతాలను పరిశీలించారు. ఆలయ పరిసరాలు శుభ్రంగా ఉండాలని ఆదేశించారు. సమావేశం జరిగే హల్ లో విద్యుత్ ఇబ్బందులు అదేవిధంగా మైక్ సౌండ్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించే ఎన్టీఆర్ అతిథి గృహంలో మార్పులు చేయాల్సిన అంశాల పై పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలపై ప్రత్యేక బద్రత చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. 

Tags:    

Similar News