CM Revanth Reddy : రేపు సొంత జిల్లాలో సీఎం రేవంత్ టూర్.. వరాల జల్లుకు అవకాశం

Update: 2024-07-08 07:04 GMT

సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) చెప్పినట్లుగానే జిల్లాల టూర్లకు రెడీ అవుతున్నారు. సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి తన జిల్లా పర్యటనలను సీఎం రేవంత్ రెడ్డి ఆరంభించనున్నారు. పాలమూరు నుంచి జిల్లాల టూర్ ప్రారంభిం చేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈనెల 9న మహబూబ్ నగర్ వెళ్లనున్న సీఎం రేవంత్.. జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్ట్లు, విద్య, వైద్యంపై రివ్యూ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఐదుగురు కలెక్టర్లు, ఇతర అధికారులతో సమీక్ష ఏర్పాటు చేయనున్నారు. కాగా ఈ జిల్లాలో పురోగతిలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై కూలం కషంగా చర్చించనున్నారు. తుది దశకు చేరిన ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేసే విషయమై కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన వరంగల్ జిల్లాలో పర్యటించారు. అక్కడి జిల్లా అధికారులతో సమీక్షించి కీలక ఆదేశాలు చేశారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా తన పర్యటన సందర్భంగా అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ మేరకు అధికారులు విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఐదు జిల్లాల కలెక్ట ర్లకు ప్రభుత్వం సమాచారమందించింది. పూర్తి వివరాలతో సీఎం సమావేశంలో పాల్గొనాలని ఆదేశాలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులంతో సమగ్ర నివేదికలను రూపొందిస్తున్నారు. ఈ సమావేశానికి సర్వసన్నద్ధమవుతున్నారు.

Tags:    

Similar News