సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో ఆయన తొలుత ఏడుపాయల వనదుర్గమాత ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆపై అక్కడే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం మెదక్ CSI చర్చి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారని చెప్పాయి. అటు, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ కూడా నేడు మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. కౌడిపల్లి మండలం తునికి కృషివిజ్ఞాన కేంద్రంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2:15కి హెలికాప్టర్ ద్వారా ఉపరాష్ట్రపతి, గవర్నర్ తునికి చేరుకోనున్నారు. సేంద్రీయ వ్యవసాయంపై 800 మంది రైతులతో ఉపరాష్ట్రపతి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్యక్రమం అనంతరం సాయంత్రం 4:20 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.