KCR Birthday : కేసీఆర్‌కు సీఎం రేవంత్ హ్యాపీ బర్త్ డే.. శుభాకాంక్షల వెల్లువ

Update: 2025-02-17 07:30 GMT

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో కేసీఆర్ ను విష్ చేశారు. గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదినం సందర్భంగా వారికి హార్దిక శుభాకాంక్షలు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. అటు ఏపీ మంత్రి నారా లోకేష్‌ కూడా కేసీఆర్‌కు విషెస్‌ చెప్పారు. ట్విట్టర్‌ వేదికగా అభినందనలు తెలిపారు. ఆయురారోగ్యాలతో సంపూర్ణ జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.

నాన్న తెలంగాణ హీరో కావడం తన అదృష్టమని కేటీఆర్ ట్వీట్ చేశారు. కేసీఆర్ సాధించినవాటిలో కొంతైనా చేరుకోవాలన్నది తన ఆశ అని తెలిపారు. మరోవైపు తెలంగాణ ఉద్వేగం, ఉద్రేకం, ప్రజాగళం, ఆత్మగౌరవ రణం కేసీఆర్ అంటూ హరీష్ రావు ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. తనకు రాజకీయ చైతన్యం నేర్పించి చరితార్థున్ని చేశారన్నారు. ఏపీ మాజీ సీఎం జగన్‌ కూడా కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కూతురు కవిత హ్యాపీ బర్త్‌ డే డాడీ అంటూ ఎక్స్‌లో కేసీఆర్‌ నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫొటోను పోస్ట్‌ చేశారు.  

Tags:    

Similar News