Vikarabad : సంచలనం.. కలెక్టర్ పై దాడి ఘటనలో 300 మంది అరెస్ట్

Update: 2024-11-12 07:45 GMT

వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌పై దాడిని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. దాడికి పాల్పడిన వారిని అర్థరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 300 మందిని పరిగి పీఎస్‌కు తరలించారు. దాడిలో పలువురు అధికారులకు గాయాలు అయ్యాయి. ఫార్మాకంపెనీ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణపై లగచర్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వచ్చిన కలెక్టర్, అధికారుల వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడులు చేశారు. దీనిపై.. బీఆర్ఎస్ సోషల్ మీడియా విమర్శలను కాంగ్రెస్ తప్పుపడుతోంది. లగచర్ల వాసులను తక్షణం విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్‌రావు ట్వీట్‌ చేశారు. అర్థరాత్రి పోలీసులతో ప్రభుత్వం దమనకాండ నిర్వహించడం సరికాదన్నారు. ఐతే దాడిపై స్పందించిన కలెక్టర్.. అల్లరిమూకలే దాడిచేశాయనీ.. వారిపై చర్యలుంటాని చెప్పడం విశేషం.

వికారాబాద్‌ కలెక్టర్‌ ఆఫీస్‌ వద్ద అధికారుల నిరసన చేపట్టారు. లగచర్లలో కలెక్టర్‌, అధికారులపై గ్రామస్థులు దాడిని ఖండిస్తూ అధికారులు ఆందోళనకు దిగారు. కలెక్టర్‌ కార్యాలయానికి తాళం వేసి నిరసన చేశారు. ఏకంగా కలెక్టర్‌పై దాడి చేస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రేపటి నుంచి పెన్‌ డౌన్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని..అంత వరకు తమ నిరసన కొనసాగిస్తామన్నారు.

Tags:    

Similar News