Siddipet : మంత్రి హరీష్ రావు ఉండగానే టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం..!
Siddipet : సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు పాల్గొన్న కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.;
Siddipet : సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు పాల్గొన్న కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాఠశాల శంకుస్థాపనకు వెళ్లిన మంత్రి హరీష్ రావు ముందే... టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలతో చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్ రావుతో పాటు హాజరైన బీజేపీ కార్యకర్తలు... పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వాళ్లకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ శ్రేణులు కూడా నినాదాలు చేశాయి. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో... పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.