Bandi Sanjay : గద్దర్ ను అవమానించింది కాంగ్రెస్సే : బండి సంజయ్

Update: 2025-02-01 11:15 GMT

బీజేపీ ఆఫీసున్న వీధి పేరును ప్రజాయుద్ద నౌక గద్దర్ పేరిట మారుస్తానని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్అయ్యారు. ఆయన్ను జీవితాంతం అవమానించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. ‘పద్మ అవార్డు ఇవ్వనందుకు ఓ వీధి పేరు మారుస్తానని ముఖ్యమంత్రి అనడం చూస్తుంటే నవ్వొస్తోంది. ఇది పిల్లల ఆటనా? ప్ర జాస్వామ్యంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన ఓ వ్యక్తి ఈ స్థాయిలో వ్యవహరించడం కరెక్టేనా? గద్దర్ ఏంటో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కానీ ఆయనపై ఉపా కేసులు పెట్టింది, అవమా నించింది కాంగ్రెస్ పార్టీయే. ఇప్పుడు అదే పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం, ఆయన్ను గౌరవించినట్లు నటిస్తోంది. గతంలో నక్సలిజం కారణంగా దుద్దిళ్ల శ్రీపాద రావు, చిట్టెం నరసింహ రెడ్డి వంటి ఎందరో నాయకులు, పోలీస్ అధికారుల కుటుంబాలు తీవ్రంగా నష్ట పోయాయి. అలాంటప్పుడు రాష్ట్ర హోంమంత్రి గా మీరు బాధిత కుటుంబాల కంటే రాజకీయ లబ్ధి గురించే ఎందుకు ఆలోచిస్తున్నరు. ఈ చీప్ పాలిటిక్స్ ఆపి.. ఆరు గ్యారెంటీలు, 420 నకిలీ వాగ్దానాల అమలుపై ఫోకస్ చేయండి. రేవంత్.. దమ్ముంటే ముందుగా హైదరాబాద్ పేరును భాగ్యనగర్ గా, నిజామాబాద్ పేరును ఇందూరుగా, మహబూబ్ నగర్ పేరును పాల మూరుగా మార్చండి' అని ట్వీట్ చేశారు.

Tags:    

Similar News