బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సామాజిక న్యాయానికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ అని ఆయన అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్పార్టీలో ఏ అవకాశం వచ్చినా బీసీ, ఎస్సీ,ఎస్టీలకు ప్రయారిటీ ఇస్తుం దన్నారు. 'కులగణన చేసినా.. ఎస్సీ వర్గీకరణ చేసినా. పార్టీ, ప్రభుత్వ, చట్ట సభల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు పదవులు ఇచ్చినా అది కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం అవుతుంది. మొదట వచ్చిన ఎమ్మె ల్సీలలో బీసీ లకు రెండు ఒక మైనార్టీకి ఇచ్చాం. తర్వాత రెండు రాజ్యసభ సీట్లు వస్తే ఒక సీటు యువ బీసీ నేత అనిల్ కుమార్ యాదవ్ కు కేటాయించాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నాలుగు ఎమ్మెల్సీ అవకాశాలు వస్తే ఒక సీటు పొత్తు ధర్మంలో సీపీఐ కి ఇచ్చాం. వారు కూడా అక్కడ బీసీ అభ్యర్థికి ఇవ్వడం హర్షించదగ్గ విషయం. కాంగ్రెస్ పార్టీ నుంచి 3 వస్తే ఒక ఎస్టీ, ఒక ఎస్సీ, ఒక బీసీ మహిళకు టికెట్లు ఇచ్చాం. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా కుల గణన చేసి 56 శాతం బీసీలు ఉన్నారని తేల్చాం. అసెంబ్లీ లో బిల్లు పెట్టి తీర్మానం చేసి దేశ వ్యాప్తం గా బీసీ కులగణన అయ్యేలా పోరాటం చేస్తాం. సామాజిక న్యాయానికి ప్రభుత్వం రోల్ మోడల్ గా ఉంటుంది.కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం లోనే సామాజిక న్యాయం ఉంది' అని పీసీసీ చీఫ్ అన్నారు.