రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలే దని, పైసా అప్పు కూడా పుట్టడం లేదని, ఢిల్లీకి పోతే చెప్పులెత్తుకుపోతారేమోనని దొంగలాగా చూస్తూ అపాయిట్ మెంట్ కూడా ఇవ్వడం లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యా ఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. ఇగ తెలంగాణలో కాంగ్రెస్ ఖేల్ ఖతం... దుకాణం బంద్ అయినట్లేనని అన్నారు. సంవిధాన్ పుస్తకం పట్టుకుని తెలంగాణ ప్రజలకిచ్చిన హామీల న్నీ అమలు చేస్తానని గతంలో హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడెం సమాధానం చెబుతా రని ప్రశ్నించారు. సీఎం వ్యాఖ్యలపై మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో భయం పట్టుకుందన్నారు. ఇచ్చిన మాట తప్పి చేతులెత్తేసిన కాంగ్రెస్ ను పదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజల తో కలిసి రేపటి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల ను అడ్డుకుని తీరుతామని చెప్పారు. రాజన్న సి రిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేటలో బండి మీడియాతో మాట్లాడుతూ 'తెలంగాణ రాష్ట్రమనే కుటుంబా నికి పెద్దగా ఉండాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాతో ఏం కాదు. ఏమీ చేయలేని స్థితిలో ఉన్నా. రాష్ట్రం దివాళా తీసింది. అని మాట్లా డటం సిగ్గు చేటు. ఇప్పటికే కాంగ్రెస్ పట్ల ప్ర జలకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నరు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఇగ అమలు చేయ లేనని సీఎం తేల్చేశారు. వృద్ధులకు రూ.4 వేల పింఛన్ ఇగ ఇయ్యరు. మహిళలకు నెలనెలా రూ.2500లు, తులం బంగారం ఒట్టిమాటేన ని తేలింది. నిరుద్యోగులకు రూ.4 వేల భృతి, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇయ్య రని తేల్చేసినట్లే. రైతులకిచ్చిన హామీలను గాలి కొదిలేసినట్లే'అని అన్నారు.