Telangana News : సంక్రాంతికి కాంగ్రెస్ లో పదవుల భర్తీ..

Update: 2026-01-01 05:13 GMT

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉంది. అయితే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పూర్తి స్థాయిలో పార్టీ పదవులను, నామినేటెడ్ పదవులను భర్తీ చేయట్లేదు. గత పదేళ్లుగా ఎలాంటి పదవులు లేక ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. వాళ్లకు ఈ సంక్రాంతి వరకు గుడ్ న్యూస్ వచ్చేలా కనిపిస్తోంది. పార్టీలో నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ లు, ప్రచార కమిటీచైర్మన్, కోశాధికార చైర్మన్ పదవులను భర్తీ చేయబోతున్నారు. ప్రచార కమిటీ చైర్మన్ పదవికి జగ్గారెడ్డి పేరు కీలకంగా వినిపిస్తోంది. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ లను ఓసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నేతలు ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

ఓసీలో చామల్ కిరణ్‌ కుమార్ రెడ్డి, రోహిణ్‌ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి. మైనార్టీల్లో ఫిరోజ్ ఖాన్, అస్మద్ మధ్య ప్రధానంగా పోటీ కనిపిస్తోంది. కాంగ్రెస్ లో ఈ పదవులపై చాలా పోటీ కనిపిస్తోంది. ఎందుకంటే చాలా ఏళ్లుగా పదవులు లేక ఎదురు చూస్తున్న సీనియర్లు, యువ నేతలు ఎంతో మంది ఉన్నారు. కోశాధికార చైర్మన్ పదవికి కూడా డిమాండ్ బాగానే ఉంది. మంత్రి పదవులు ఆశించి నిరాశకు గురైన ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఈ పదవులపై ఆశలు పెంచుకుంటున్నారు. మరోసారి మంత్రి వర్గ విస్తరణ ఉంటున్నా.. అందులో అవకాశం వస్తుందో రాదో అనే అనుమానాలతో ప్రస్తుత ఎమ్మెల్యేలు ఈ పదవుల కోసం ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు.

ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, టీసీసీసీ చీఫ్‌ మహేశ్ గౌడ్ తో దీనిపై చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. సంక్రాంతి వరకు పేర్లు ఖరారు కాబోతున్నాయంట. ఈ పదవుల కోసం సీఎం రేవంత్ దగ్గరకు భారీగానే దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. నామినేటెడ్ పదవులపై కూడా త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.


Full View

Tags:    

Similar News