అక్కినేని కుటుంబం, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. అనుకోకుండా అక్కినేని కుటుంబంపై ఈ వ్యాఖ్యలు చేశారన్నారు తెలంగాణ మంత్రి కొండా సురేఖ. కేటీఆర్ తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో భావోద్వేగానికి గురై, ఆయనపై విమర్శలు చేసే క్రమంలో అనుకోకుండా అలా వ్యాఖ్యలు చేశారన్నారు. తనకు ఎవరిమీద వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. అక్కినేని కుటుంబం చేసిన పోస్టులు చూసి చాలా బాధపడ్డానన్నారు కొండా సురేఖ. అదే సమయంలో కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదన్నారు. కేటీఆర్ కు లీగల్ నోటీసు పై న్యాయపరంగా ముందుకెళ్తా మన్నారు కొండా సురేఖ తెలిపారు.