వేములవాడ రాజన్న ఆలయంలో దర్గాను తొలగించాలంటూ హుండీలో చీటీలు వేశారు కొందరు భక్తులు. ఆ చీటీల్లో దర్గా హఠావో.. వేములవాడ బచావో అని రాసి ఉంది. ఆలయ అధికారులు హుండీ లెక్కింపు చేపట్టగా ఈ చీటీలు బయటపడ్డాయి. గత కొన్ని రోజులుగా వేములవాడ రాజన్న ఆలయంలో ఉన్న దర్గాను తొలగించాలని ఆందోళనలు జరుగుతున్నాయి. ఇటీవలే లేడీ అఘోరీ ఆలయానికి వెళ్లి దర్గా తొలగించాలంటూ హంగామా చేశారు. తాజాగా హుండీలో వచ్చిన చీటీల్లో దర్గా హఠావో..వేములవాడ బచావో చీటీలు ప్రత్యక్షం కావడం హాట్ టాపిక్ గా మారింది.