కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం.. ఇవాళ, రేపు మందు బంద్..
జూన్ 4-5 తేదీల్లో ఎన్నికల ఫలితాల సందర్భంగా హైదరాబాద్‌లో మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు;
నిబంధనలు ఉల్లంఘించిన వారిని శిక్షిస్తామని నగర పోలీస్ కమిషనర్ కె.శ్రీనివాసరెడ్డి ఉత్తర్వుల్లో తెలిపారు. జూన్ 4న మంగళవారం నాడు ప్రకటించనున్న లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్, ఫలితాల దృష్ట్యా నగరంలోని వైన్ షాపులు, టోడీ కాంపౌండ్‌లు, బార్‌లు, రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లలో మద్యం విక్రయాలు నిషేధించనున్నారు. జూన్ 4 ఉదయం 6 నుండి జూన్ 5 ఉదయం 6 వరకు మద్యం షాపులు మూసివేశారు.