Telangana Covid Cases: తెలంగాణలో థర్డ్‌వేవ్‌ మొదలైంది - డీహెచ్‌ శ్రీనివాసరావు

Telangana Covid Cases: తెలంగాణలో థర్డ్‌వేవ్‌ మొదలైందన్నారు డీహెచ్‌ శ్రీనివాసరావు.

Update: 2022-01-06 08:55 GMT

Telangana Covid Cases: తెలంగాణలో థర్డ్‌వేవ్‌ మొదలైందన్నారు డీహెచ్‌ శ్రీనివాసరావు. తాజాగా GHMC పరిధిలో 970.. రంగారెడ్డి జిల్లాల్లో 177 కేసులు వచ్చాయన్నారు. పాజిటివిటి రేటు 1 శాతం నుంచి 3 శాతం వరకు పెరిగిందన్నారు. పాజిటివ్‌ వచ్చినవారు 5 రోజుల్లోనే కోలుకున్నారని ఆయన తెలిపారు. ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ కోవిడ్‌ రూల్స్‌ పాటించాలన్నారు. అనవసరమైన ట్రీట్‌మెంట్స్‌ చేస్తే ఆయా హాస్పిటల్స్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వారం నుంచి దేశంలో భారీస్థాయిలో కేసులు పెరుగుతున్నాయన్నారు డీహెచ్‌ శ్రీనివాసరావు. అమెరికా, UKతో పాటు 170 దేశాల్లో కరోనా విభృంభిస్తోందన్నారు. ప్రజలందరూ వచ్చే 4 వారాలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. తెలంగాణలో కోటికి పైగా ఐసోలేషన్‌ కిట్స్‌ అందుబాటులో ఉన్నాయన్నారు. 27 వేలకు పైగా ప్రభుత్వ హాస్పిటల్లో బెడ్స్‌ సిద్ధం చేసినట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Tags:    

Similar News