తెలంగాణలో టపాసులు కాల్చుడు బంద్..!

Update: 2020-11-12 09:28 GMT

టపాసులు కాల్చుడు తెలంగాణలో బంద్. బాణసంచా కాల్చడంపై నిషేధం విధించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. టపాసులు అమ్ముతున్న షాపులను మూసివేయించాలని ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పింది. దీనిపై విస్తృత ప్రచారం చేయాలని కూడా సూచించింది. కరోనా కేసులు ఇంకా నమోదవుతున్నందున బాణసంచా కాల్చడంపై నిషేధం విధించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కరోనా సమయంలో బాణసంచా పేల్చడం వల్ల శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు వస్తాయని పిటిషనర్ వాదించారు. రాష్ట్రంలో ఇంకా కరోనా కేసులు నమోదవుతుండడంతో.. బాణసంచా కాల్చడంపై నిషేధం విధించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

Tags:    

Similar News