Road Accident : ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును ఢీకొన్న డీసీఏం

Update: 2025-03-20 12:00 GMT

మెదక్ జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బస్సును డీసీఎం వ్యాన్ ఢీ కొట్టడంతో ఇద్దరు మహిళలు మృతి చెందగా, 11 మందికి గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఏపీ విజయనగరం నుంచి 40 మంది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో శ్రీశైలం నుండి తుల్జాపూర్ భవాని మాతను దర్శించుకునేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో పెద్దశంకరంపేట మండలం కోలపల్లి వద్ద కాల కృత్యాల కోసం నేషనల్ హైవే 161 పక్కన బస్సును ఆపారు. ఈక్రమంలో ఆగి ఉన్న ట్రావెల్ బస్సును డీసీఏం వెనుక నుండి అతివేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నారాయణమ్మ (50) అనే మహిళ స్పాట్ లోనే మృతి చెందగా, సూరపమ్మ (60) అనే మహిళ జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో 11 మందికి గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.

Tags:    

Similar News