ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి కేబినేట్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ల పేర్లను తిరిగి గవర్నర్ ఆమోదానికి పంపించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు తగిన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. రెండో విడతగా చెల్లించాల్సిన బకాయిల చెల్లింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మల్లన్నసాగర్ నుంచి గోదావరి నీటిని పంప్ చేసి హైదరాబాద్ జంట జలాశయాలు అయిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు తరలించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 15 టీఎంసీలను తరలించనున్నారు.