Dengue In Telangana : రాష్ట్రంలో పెరిగిపోతున్న డెంగ్యూ జ్వరాలు..

Dengue In Telangana : రాష్ట్రంలో రోజురోజు డెంగ్యీ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయని ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ శంకర్ వెల్లడించారు;

Update: 2022-08-29 11:00 GMT

Dengue In Telangana : రాష్ట్రంలో డెంగ్యూ ఫీవర్ పంజా విసురుతోంది. రోజురోజు డెంగ్యీ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయని ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ శంకర్ వెల్లడించారు. ఈ నెలలో ఞక్క ఫీవర్ ఆస్పత్రిలోనే 170 మంది డెంగ్యూ పేషెంట్లు జాయిన్ అయినట్లు వెల్లండిచారు. గత నెలలో ఒక్క ఫీవర్ ఆస్పత్రిలోనే 80 డెంగ్యూ కేసులు వెలుగులోకి వచ్చాయి. డెంగ్యూతో పాటు టైఫాయిడ్ కేసులు భారీగా నమోదు అవుతున్నట్లు సూపరింటెండెంట్ శంకర్ తెలిపారు. ఉస్మానియా, గాంధీలోనూ అధికంగా డెంగ్యూ పెషేంట్లు చికిత్స పొందుతున్నారని చెబుతున్నారు. 

Tags:    

Similar News