HCU : హెచ్‌సీయూలో ఉన్న భూములెన్ని.. దేనికి ఎన్ని ఎకరాలో తెలుసా?

Update: 2025-04-01 09:45 GMT

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో మొదట 2,300 ఎకరాలు కేటాయించారు. సిక్స్ పాయింట్ ఫార్ములా ప్రకారం హెచ్సీయూను 1974లో ఏర్పాటు చేశారు. దీనికి 2,300 ఎకరాలు కేటాయించారు. మొత్తంలో టీఐఎఫ్ఆర్ కు 200 ఎకరాలు, ఐఎస్బీకి 260, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల కోసం 200 ఎకరాలు ఎఐఏబీకి 100, నిడ్ కు 30, హెచ్సీయూ ఆర్టీసీ డిపోకు 9ఎకరాలు, ట్రిపుల్ ఐటీకి 60 ఎకరాలను కేటాయించారు. అంతేకాక విద్యుత్ సబ్ స్టేషన్, గచ్చిబౌలి స్టేడియం, ట్రిపుల్ ఐటీ విద్యుత్ కేంద్రం, ఎంఆర్డీఓ, ఎంఈఓ కార్యాలయాలకు, జీహెచ్ఎంసీ వెస్ట్ జోన్, సర్కిల్ కార్యాలయాలకు, టిమ్స్ ఆస్పత్రికి దాదాపు 100 ఎకరాలు కేటాయించారు. ఇటీవలే టీఎస్ఓ కాలనీకి ఐఎస్బీ ప్రహరీని ఆనుకొని లింకు రోడ్డుకు 20 ఎకరాలు కూడా హెచ్సీయూ నుంచి సేకరించి పెద్ద రోడ్డు వేశారు.

Tags:    

Similar News