TG : తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లను డెవలప్ చేశాం : మంత్రి అశ్వినీ వైష్ణవ్

Update: 2024-07-24 13:15 GMT

తెలంగాణలో రూ.32 వేల 946 కోట్లతో రైల్వే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కేంద్ర బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులపై బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో రైల్వే లైన్లు వంద శాతం విద్యుద్దీకరణ జరిగాయన్నారు. అమృత్‌ పథకం కింద 40 రైల్వే స్టేషన్లను పూర్తిగా అభివృద్ధి చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది రైల్వేలకు రూ.9,151 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. అమరావతిని లింక్ చేస్తూ 56 కి.మీ మేర రూ.2,047 కోట్లతో ప్రాజెక్టు రూపొందించామన్నారు. రైల్వే పనులపై డీపీఆర్‌ను నీతి ఆయోగ్‌ ఆమోదించిందని.. మరిన్ని అనుమతుల కోసం కొంత సమయం పట్టే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News